Wednesday, 1 October 2014

“హైదర్” పై అమితాబ్ ప్రశంసల జల్లు




MaaStars





“హైదర్” పై అమితాబ్ ప్రశంసల జల్లు



Amitabh-Bachchanకేవలం తన సినిమాలే కాకుండా, తనకి ఏ సినిమా నచ్చితే ఆ సినిమా లోని నటీనటులని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో పొగడటం బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కి మొదటి నుంచీ అలవాటు. ఆ మంచి మనసుకే ఎంతోమంది అమితాబ్ అంటే పది చస్తారు. ఏకంగా బిగ్ బి దగ్గరనుండి ప్రశంసలు వస్తే ఎంతటి ఆర్టిస్ట్ కి అయినా అదొక పండాగే అని చెప్పొచ్చు. తాజాగా అలాంటి అనుభవమే షాహిద్ కపూర్ నటించిన ‘హైదర్’ సినిమా విషయంలో జరిగింది. ‘హైదర్’ సినిమాపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. ఇదో ప్రత్యేకమైన సినిమా అని కితాబిచ్చారు. షేక్‌స్పియర్ విషాదాంత నాటకం ‘హామ్లెట్’ ఆధారంగా విశాల్ భరద్వాజ్ ‘హైదర్’ చిత్రాన్ని తెరకెక్కించారు.


‘హైదర్… స్పెషల్ సినిమా… ఇందులో నటులు అసామాన్య నటన ప్రదర్శించారు. నవలను సినిమాకు అనుగుణంగా చాలాబాగా రూపాంతరీకరించారు’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. ‘హైదర్’ లో షాహిద్ కపూర్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించింది. టబు, ఇర్ఫాన్ ఖాన్, కేకే మీనన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


The post “హైదర్” పై అమితాబ్ ప్రశంసల జల్లు appeared first on MaaStars.








No comments:

Post a Comment