MaaStars
మా ఇద్దరికీ పడట్లేదు..
కొంతమంది దర్శక హీరోలకి వ్యక్తిగంటగా పడకపోయినా, వృత్తి పరంగా కలిసి పనిచేయాల్సి వస్తుంది ఒక్కోసారి అన్నదానికి వీళ్ళిద్దరూ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. 2011 వ సంవత్సరంలో పాకిస్థాన్ లో సూపర్‌హిట్ టి.వి షో “హమ్సఫర్” కి సర్మద్ దర్శకత్వం వహించాడు. ఫవద్ హీరోగా నటించాడు. అయితీ వీళ్ళిద్దరూ వృత్తిపరంగా కలిసి చాలాకాలం పని చేసినా, ఎందుకో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చాయి అన్నది అక్కడి టాక్.
ఇదే విషయాన్ని ఇటీవల మీడియాతో పంచుకుంటూ సర్మద్” ‘ఫవద్ మంచి నటుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే
నాకు,అతనికి పని విధానంలో చాలా తేడా ఉంది. మా ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ అంతగా కుదరలేదనే చెప్పాలి. హమ్‌సఫర్ వరకు మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానేఉన్నాయి. అయితే అతడితో మళ్లీ,మళ్లీ పనిచేయాలనే ఆలోచన నాకు లేదు.. అతడు నా విష్ లిస్ట్‌లో లేడు..’ అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా అలాంటిదేమీ లేదన్నాడు. ‘నాకు ఫవద్ నటనంటే చాలా ఇష్టం.. అయితే మా మధ్య అంతగా విభేదాలు లేవు.. భవిష్యత్తులో అతడితో పనిచేయాల్సి వస్తే తప్పకుండా చేస్తా.. నేను, ఫవద్, మహిరా కలిసి మళ్లీ ఒక ప్రాజెక్టు చేస్తామనే అనుకుంటున్నా..” అని ముగించాడు.
The post మా ఇద్దరికీ పడట్లేదు.. appeared first on MaaStars.
No comments:
Post a Comment