MaaStars
బంజారాహిల్స్ లో ‘గోల్డెన్’ గోవిందుడు
కృష్ణవంశీ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన “గోవిందుడు అందరివాడేలే” చిత్రం పాజిటివ్ టాక్ తో ఊపిరి పీల్చుకున్న రామ్ చరన్ తేజ్. తాజాగా బంజారాహిల్స్ లో ఉన్న లాల్‌చంద్ హస్తిమల్ జ్యువెలర్స్ యూనిట్ కరిష్మా అండ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను చెర్రీ బుధవారం ప్రారంభించాడు.
అందరివాడైన గోవిందుడు.. బంగారు బృందావనంలో మెరిశాడు. జ్యువెలరీ అందాలను వీక్షిస్తూ అందరినీ ఆనందపరిచాడు.
ఈ కార్యక్రమానికి ఈ యంగ్ హీరోతో పాటు ఆయన మరదలు అనుష్ పాల, అపోలో హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్‌వైడ్ లిమిటెడ్ గోల్డెన్ కలెక్షన్ లగ్జరీ బ్రాండ్ ‘ఇకాని’ ప్రివ్యూను, రోజెంథాల్ డిన్నర్‌వేర్, గ్లాస్‌వేర్ కలెక్షన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
The post బంజారాహిల్స్ లో ‘గోల్డెన్’ గోవిందుడు appeared first on MaaStars.
No comments:
Post a Comment