MaaStars
ఆ రెండూ నా పర్సనల్ : ఒక ముద్దుగుమ్మ
అదేంటో కానీ, సినీ రంగంలోని ప్రతీ ముద్దుగుమ్మకీ రెండు విషయాల గురించి మాట్లాడటంలో అభ్యంతరం ఉంటుంది. మీడియా కంట్లో పడేలా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. ఏంటి సంగతి అని ఎవరైనా ఆరా తీస్తే మాత్రం, అది పర్సనల్ అంటుంటారు. సరిగ్గా అదే బాటలో ముద్దుగుమ్మ పార్వతీ మీనన్ కూడా వెళ్తోంది. ఈ మలయాళి కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయినా ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం అప్పట్లో గ్లామర్‌కు అంగీకరించక పోవడం, ఈత దుస్తులు ధరించను లాంటి పలు షరతులుపెట్టడం. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడి దరిదాపులకు పోలేదని టాక్ ప్రచారంలో ఉంది. ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కమల్‌హాసన్ సరసన ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం లభించింది.
ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి పార్వతి వెల్లడిస్తూ ఉత్తమవిలన్ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని తెలిపింది. కమల్‌హాసన్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవమని పేర్కొంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అంది. మరియాన్ చిత్రంలో తన నటనకు పలువురి ప్రశంసలు లభించాయని పేర్కొంది. ధనుష్ మంచి నటుడని కితాబిచ్చింది. ఆయనను సహ కళాకారుడిగానే భావించి కలిసి నటించానని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే ఈ సోషల్ నెట్‌వర్క్ అంటే తనకు అంతగా ఆసక్తి లేదని వెల్లడించింది.
ఇటీవలే ఫేల్‌బుక్‌లో చేరానని చెప్పింది. అందులో అనవసర విషయాలకు తావివ్వకుండా తన సినిమాల వివరాలు, ఫొటోలను మాత్రమే పోస్టు చేస్తానని తెలిపింది. ఎవరినైనా ప్రేమిం చారా అన్న ప్రశ్నకు ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత విషయాలని, సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తానని చెప్పింది. మంచి అవకాశాలు లభించకపోతే ఖాళీగా కూర్చుంటానని పేర్కొం ది. ఎన్ని చిత్రాల చేశామన్నది ముఖ్యం కాదని, పది కాలాలు గుర్తుండిపోయే పాత్ర లు చెయ్యాలని ఆశిస్తున్నానని పార్వతి అంటోంది.
ఎంతమంది ఇలా చెప్పలేదు…. తరువాత ఎలాంటి సినిమాలు చేసారో , పాత్రలు వేశారో మనం చూడలేదు? అనుకుంటున్నారా? అయితే అనుకోండీ…ఏ మాత్రం తప్పులేదు మరి.
The post ఆ రెండూ నా పర్సనల్ : ఒక ముద్దుగుమ్మ appeared first on MaaStars.
No comments:
Post a Comment