MaaStars
పాపకి ప్రేమలో పడాలనుందట..!!
ఆల్రెడీ ప్రేమలో మునిగి తేలుతున్న జంటలె, అంతా తూచ్ అదేం లేదు అంటుంటే … బాలీవుడ్ బొద్దుగుమ్మ పరిణీతి చోప్రా మాత్రం తనకి ప్రేమలో పడాలని ఉంది అని బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇస్తోంది. ఇంతవరకూ నేను ప్రేమకోసం ఎప్పుడూ వెతకాలేదు. అయితే, తన కోసం ప్రేమ ఎప్పుడొచ్చినా తాను దానికోసం సిద్ధంగానే ఉన్నానని, అది ఎవరైనా కావచ్చు.. సినీ పరిశ్రమ నుంచైనా కావచ్చని అందాల సుందరి పరిణీతి చోప్రా చెప్పింది. ప్రేమలో పడకూడదంటే మాత్రం తాను ఒప్పుకోనని స్పష్టం చేసింది. ఆమె దాదాపు ప్రతిరోజూ పుట్టినరోజు పండుగ చేసుకుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే చెప్పింది. బుధవారం ఆమె తన 26వ పుట్టినరోజు చేసుకుంటోంది. అయితే ఈసారి మాత్రం.. పెద్దగా పార్టీలు ఏమీ చేయట్లేదని పరిణీతి చెప్పింది. తన అన్నయ్య ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల కేవలం ఇంట్లో అందరం కలవడం తప్ప పార్టీ ఏమీ చేయట్లేదని తెలిపింది.
‘కిల్ దిల్’ చిత్రం పాట ఆవిష్కరణకు వెళ్లి, మధ్యాహ్నంలోపు వచ్చేసి తన తల్లిండ్రులు, అన్నయ్యతో కలిసి గడుపుతానని వివరించింది. కొన్ని నెలల క్రితమే పరిణీతి ఓ జాగ్వార్ కారు కొంది. తన తల్లిదండ్రుల కోసం కూడా ఓ కారు కొన్నానని, ఇది తనకు చాలా సంతోషంగా లనిపించిందని, ఇక ఓ ఇల్లు కొనడమే మిగిలిందని, అందుకోసం డబ్బులు పొదుపు చేస్తున్నానని చెప్పింది. తన పుట్టినరోజు నాడు అందరికీ ఆరోగ్యం బాగుండాలనే తాను ప్రార్థిస్తున్నాననని, తన కుటుంబం, స్నేహితులు లేనిదే తాను లేనని.. అందుకే వాళ్ల కోసం ప్రార్థనలు చేస్తున్నానని తెలిపింది. తనకు ప్రతిరోజూ పుట్టినరోజు పండగేనని, తన బర్త్ డే ఎప్పుడొస్తుందా అని నెలలు, వారాలు, రోజులు లెక్కపెట్టుకుంటానని చెప్పింది. తన సన్నిహితులు ఎవరైనా తన పుట్టినరోజు మర్చిపోతే మాత్రం చాలా బాధపడతానని పరిణీతి అంటోంది. కేకు అంటే చాలా చాలా ఇష్టమని, ఎంత తిన్నా తక్కువేనని తెలిపింది.
కేకుని లైకే చిన్నది…. ప్రేమకై చూస్తున్నదీ…ఎవరైనా ఓకే అన్నది…ట్రై చేస్కోండి మరి…!!
The post పాపకి ప్రేమలో పడాలనుందట..!! appeared first on MaaStars.
No comments:
Post a Comment