MaaStars
Thursday, 31 July 2014
Wednesday, 30 July 2014
సెక్స్‌బాంబ్ పై కేసు వేశారు
MaaStars
సెక్స్‌బాంబ్ పై కేసు వేశారు
ఎవరా శృంగార నాయిక అనుకుంటున్నారా? ఈ మధ్య అంటే అందరూ సన్నీ లియోన్ గురించి మాట్లాడుతున్నారు కానీ, అంతకుముందు ఆ రేంజ్ లో అందాలని ఆరబోసిన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మల్లికా షెరావత్ . ఈ ముద్దుగుమ్మపై హైదరాబాద్ కి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త టి. ధనగోపాలరావు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తను తాజాగా నటించిన “డర్టీ పాలిటిక్స్” అనే సినిమాలో మల్లిక జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకుని అవమానించింది అన్నది ఆయన అభియోగం. అందుకని మల్లికపై కటిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోర్టుని కోరారు.
ఆ చిత్ర నిర్మాత కస్తూర్ చంద్ బొకాడియా ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాను అవమానపరిచేలా ఉన్న వాల్ పోస్టర్‌లను విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
The post సెక్స్‌బాంబ్ పై కేసు వేశారు appeared first on MaaStars.
Tuesday, 29 July 2014
“Avunu-2″to start form 1st August
MaaStars
“Avunu-2″to start form 1st August
Finally it is all set for “Avunu-2″s shoot. As per the latest buzz, it is learnt that the regular shooting of the movie is about to start on 1s August it seems. Shooting of the film is said to be completed in a single schedule.
Interestingly, Ravibabu is repeating the same cast even in the sequel. This film features Harshavardhan Rane and Poorna in the lead roles. ‘Avunu 2’ will be jointly produced by Flying Frogs and Suresh Productions.
The post “Avunu-2″to start form 1st August appeared first on MaaStars.
Monday, 28 July 2014
Tamannah is the hottest: says Nag
MaaStars
Tamannah is the hottest: says Nag
Nagarjuna is admired by many people for his style and looks. But when the actor was posed with the question of who he finds hot, he says it’s Tamannaah. In a reality TV show on Sunday, the actor appeared as special guest along with Suhasini Maniratnam and veteran director K. Raghavendra Rao. When Suhasini asked Nagarjuna to choose between Samantha, Kajal, Shruti Haasan and Tamannaah, Nag says, “Everybody is hot, but Tamannah is the hottest.” When they quizzed Nag who he admires most when he was young, he says Jayasudha and Jaya Prada. He says that he had seen late NTR’s classic film Adavi Ramudu 20 times. “Both Jaya Prada and Jayasudha were in the film and I admire them a lot since the time I first saw the film,” says Nag.
The post Tamannah is the hottest: says Nag appeared first on MaaStars.
Sunday, 27 July 2014
మళ్లీ వార్తల్లోకి ఎక్కిన “ఆశీర్వాద్”
MaaStars
మళ్లీ వార్తల్లోకి ఎక్కిన “ఆశీర్వాద్”
అలనాటి అందాల నటుడు, మొట్టమొదటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు ఎంతో ఇష్టమైన ‘ఆశీర్వాద్’ బంగ్లా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ముంబయి బాంద్రాలోని ఇదే బంగ్లాలో రాజేశ్ ఖన్నా 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత వారసత్వం కింద కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నాలకు ఆ ఆస్తి సంక్రమించింది. వారు ఇప్పుడు ఆ బంగ్లాను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం.
నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇంట్లో నివసించిన అనుబంధంతో ఆశీర్వాద్‌ను మ్యూజియంగా మార్చాలని ఖన్నా ఆశించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తన కూతుళ్లదేనని మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన చెప్పారు. ప్రస్తుతం వరదాన్ ఆశీర్వాద్‌గా పిలుస్తున్న ఆ ఇంటిని ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మన్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
కాగా బంగ్లా ఆస్తిలో తనకు వాటా ఉంటుందని, రాజేశ్ ఖన్నా తనకు కూడా భర్తేనని ఆయన సహచరి అనితా అద్వానీ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఖన్నా కుటుంబ సభ్యులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కూడా. డింపుల్ ఖన్నాతో విడిపోయిన అనంతరం రాజేశ్ ఖన్నా ఎనిమిదేళ్లు అనితా అద్వానీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే.. అనితా అద్వానీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని రాజేశ్ ఖన్నా భార్య డింపుల్, కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వాదిస్తూ వచ్చారు. ఆశీర్వాద్ బంగ్లా తమ పేరు మీద ఉందని, అందుకే అమ్మకానికి పెట్టినట్లు వారు చెబుతున్నారు. దాంతో ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదని పేర్కొంటూ అనితా అద్వానీ మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే వివాదంలో కోర్టులో తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. అయితే కాకాజీ కుటుంబీకులు న్యాయస్థానంపై గౌరవం ఉంచకుండా బంగ్లాను విక్రయించాలనుకోవటం సరికాదన్నారు. దీనిపై తాను తుది వరకూ పోరాడతానకి అనితా అద్వానీ స్పష్టం చేశారు.
సముద్రానికి అభిముఖంగా 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.90 కోట్ల వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాల కథనం. అయితే ఎవరైనా థర్డ్ పార్టీ.. యాజమాన్య హక్కును కోరడానికి సంబంధించి జారీ చేసిన 14 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాతే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంద నేది విశ్వసనీయ వర్గాల కథనమని టైమ్స్ ఆఫ్ ఇండియూ పేర్కొంది. 60వ దశకం చివర్లో మరో బాలీవుడ్ దిగ్గజం రాజేంద్రకుమార్ నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిన రాజేశ్‌ఖన్నా 80వ దశకంలో దాన్ని పునర్నిర్మించారు.
ఫ్రీగా వచ్చిన ఆస్తి మీద ఎవరికి మాత్రం ప్రేమ ఉండదు మరి?
The post మళ్లీ వార్తల్లోకి ఎక్కిన “ఆశీర్వాద్” appeared first on MaaStars.
Saturday, 26 July 2014
ఇప్పుడిక “హాలీవుడ్ “కహానీ
MaaStars
ఇప్పుడిక “హాలీవుడ్ “కహానీ
సుప్రసిద్ధ బాలీవుడ్ చిత్రం నిర్మాణ సంస్థ “యష్రాజ్ ఫిల్మ్స్ (వై.ఆర్.ఎఫ్)గతంలో నిర్మించిన “కహానీ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందించబడ్డ “కహానీ” బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇటీవలే తెలుగులో శేఖర్ కమ్ముల కహానీ సినిమాని “అనామిక”గా తీశాడు ,ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది ఆ సినిమా. ఇక తాజా సమాచారం ప్రకారం, “కహానీ” సినిమాని యష్రాజ్ సంస్థ బాలీవుడ్ లో “డైటీ” గా రూపొందించనుంది అని సమాచారం. దీనికి నీల్స్ ఆర్డెన్ ఓప్లోవ్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
2015 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా మొత్తం కోల్‌కతాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఒప్లేవ్ మాట్లాడుతూ సినిమా ఆద్యం తం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇందులోని ప్రతిపాత్రకు ప్రాధాన్యముంటుందన్నారు. దీనిలో భిన్న ధృవాలవంటి అమెరికన్ -ఇండియన్ సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని, దాని వల్ల హీరోయిన్ ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తనదైన శైలిలో చూపించనున్నట్లు ఒప్లేవ్ వివరించారు.
ఈ సినిమాలో కోల్‌కతా నగరాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో ఉదయ్ చోప్రా మాట్లాడుతూ..‘కహానీ’ చిత్రాన్ని ‘డైటీ’గా రీమేక్ చేయడానికి నీల్స్ మాత్రమే సమర్థుడని పొగడ్తలతో ముంచెత్తారు. తన సినిమా రీమేక్‌పై ఘోష్ మాట్లాడుతూ..‘కొంత కాలం కిందట ‘కహానీ’ని ఇంగ్లిష్‌లో రీమేక్ చేస్తానని ఉదయ్ చెబితే సరదాగా అంటున్నాడనుకున్నా కాని వాళ్లు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని తెలుసుకుని చాలా ఆనందించా.. నీల్స్ మంచి డెరైక్టర్. ప్రపంచ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ‘కహానీ’ని మలిచే సామర్థ్యం అతడికి ఉంది’ అని కితాబు ఇచ్చాడు.
The post ఇప్పుడిక “హాలీవుడ్ “కహానీ appeared first on MaaStars.
Thursday, 24 July 2014
Wednesday, 23 July 2014
“పవర్”స్టార్ పక్కన బికినీలో త్రిష?
MaaStars
“పవర్”స్టార్ పక్కన బికినీలో త్రిష?
అన్ని రోజులూ ఒకలా ఉండవు అన్నదానికి ,ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లని ఏలిన అందాల చెన్నై ముద్దుగుమ్మ త్రిష నిదర్శనం. ఆకర్షించే అందం, ఆకట్టుకునే అభినయాల మేళవింపుగా త్రిష ఒక దశలో ప్రతీ హీరోకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. కానీ, ఇప్పుడు త్రిషకి గడ్డుకాలం నడుస్తోంది. అరకొర అవకాశాలతో ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నట్టు అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా చేస్తోంది. ఒకానొక దశలో బికినీకి కూడా సై అన్నా ఈ అమ్మడుని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం త్రిష తలుపు తట్టింది. అదేమిటో చూద్దాం.
తెలుగులో మహేష్ బాబు నటించిన ‘‘దూకుడు’’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరకీ తెలిసిందే! ఈ సినిమాను కన్నడలో ‘‘పవర్’’గా రీమేక్ చేస్తున్న విషయం కూడా విదితమే! ఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ కన్నడ రీమేక్ లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మహేష్ పాత్రను పోషించగా.. గ్లామర్ డాల్ సమంత పాత్రను త్రిష పోషించనుంది. అయితే ఆ మూవీ యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం… తెలుగులో సమంత అందించిన అందాల కంటే… కన్నడలో త్రిష మరింత ఎక్కువగా ప్రదర్శించిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
బికినీ టాప్ మీద గాజుగుడ్డలను ధరించి, తన ఒంపుసొంపులను కన్నడ ప్రేక్షకులను కనువిందు చేయనుందని, దాదాపు తన శరీర అందాలను విపరీతంగా ప్రదర్శించిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రాకరాక వచ్చిన అవకాశంతోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు త్రిష ఈవిధంగా అందాల ప్రదర్శన చేస్తోందని ఇండిస్ట్రీలో చెప్పుకుంటున్నారు.ఒకవేళ ఈ సినిమా కూడా దూకుడులాగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే… త్రిషకు కన్నడలో వరుసగా అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
The post “పవర్”స్టార్ పక్కన బికినీలో త్రిష? appeared first on MaaStars.