Monday, 14 July 2014

జరగబోయేది ముందే తెలిస్తే?




MaaStars





జరగబోయేది ముందే తెలిస్తే?



Maaya Movie  designఅతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో సాగే థ్రిల్లర్‌గా మాయ చిత్రాన్ని తెరకెక్కించాం. కథ,కథనం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అన్నారు. నీలకంఠ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాయ. హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మారాజ్, నందిని రాయ్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మాణ సారథ్యంలో ఎం.వి.కె.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ జరగబోయేది ముందే తెలిస్తే ఎలా వుంటుందన్న ఊహకు తెర రూపమే మాయ. నా పదేళ్ల కల ఇది. షో సినిమాకు ముందే ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నాను. నా కలను మధుర శ్రీధర్, ఎం.వి.కె.రెడ్డి నిజం చేశారు అని తెలిపారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో మాయ ది బెస్ట్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. నీలకంఠ రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా వుంది. శేఖర్‌చంద్ర సంగీతం, నవీన్ బాలి ఎడిటింగ్, బాల్‌రెడ్డి ఫొటోగ్రఫీ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


The post జరగబోయేది ముందే తెలిస్తే? appeared first on MaaStars.








No comments:

Post a Comment