MaaStars
ఆమెతో పాటు ఈమె కూడా పూసుకుంటుందట
ఎవరితో పాటు ఎవరు ఏం పూసుకుంటారు?అనే కదా మీ సందేహం? అబ్బే…. మరేం లేదండీ…!! ప్రముఖ హెయిర్ ఆయిల్ కంపెనీ అయిన డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ప్రచారకర్తల జాబితాలో ఇప్పుడో కొత్త తార చేరింది. అస్తుతం ప్రియాంకా చోప్రా డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ కి ప్రచారం చేస్తుండగా.. ఆమెతో పాటు సోనాక్షి సిన్హాను కూడా కో-బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ డాబర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ లో ఒకే సమయంలో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఒకే ఉత్పత్తికి ప్రచారం చేయడం ఇదే మొట్టమొదటిసారి. అందులోనూ డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ విషయంలో ఇలా జరగడం అయితే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అవుతుంది.
ఈనాటి మహిళల అవసరాలు తీర్చడానికి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఒక ఫేస్ లిఫ్ట్ తయారుచేసిందని, దాంతో తమ బ్రాండు మరింత యూత్ ఫుల్ గా తయారవుతుందని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆమర్కెటింగ్ హెడ్ ప్రవీణ్ జైపూరియర్ తెలిపారు. ఈ కొత్త గుర్తింపుతో తమ బ్రాండు ఈరోజు జీవనశైలికి అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు తారలతో కూడిన ప్రచార వీడియో త్వరలోనే విడుదల అవుతుందన్నారు.
అయితే, ప్రియాంక- సొనాక్షి కలిసి ఒకే ప్రచార చిత్రంలో నటిస్తారా లేక, డాబర్ కంపెనీ సొనాక్షితో విడిగా మరో యాడ్ ఏమైనా తయారు చేస్తుందా అన్నదాని మీద ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
The post ఆమెతో పాటు ఈమె కూడా పూసుకుంటుందట appeared first on MaaStars.
No comments:
Post a Comment