Saturday, 6 September 2014

జిమ్ లో చెమటోడ్చుతున్న పవన్‌కళ్యాణ్




MaaStars





జిమ్ లో చెమటోడ్చుతున్న పవన్‌కళ్యాణ్



Pawan-Kalyan-dilraju-movieతీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా రెండు వారాల క్రితం బెంగళూరు వెళ్ళి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే, డాక్టర్ల సూచన మేరకు ఫిట్‌నెస్ కోసం పవన్ తాజాగా జిమ్ లో వ్యాయామాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గాయానికి ఫిజీయోతెరపీ తో పాటు, ఫిట్‌నెస్ కోసం నిపుణుల సమక్షంలో తేలికపాటి వ్యాయామాలు పవన్ చేస్తున్నాడని సమాచారం.


త్వరలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ షూటింగ్లో పాల్గొంటారు. ‘అత్తారింటికి దారేది’ ఘనవిజయం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో పవన్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


The post జిమ్ లో చెమటోడ్చుతున్న పవన్‌కళ్యాణ్ appeared first on MaaStars.








No comments:

Post a Comment