MaaStars
దుబాయ్ షేక్ ముందు “షేక్” చేయనున్న భామ
అరబ్బు దేశాల్లోని షేక్ లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని వారికో పేరుంది. కుప్పలు కుప్పలుగా ఉన్న డబ్బుని ఏం చేయాలో తెలియక, వాళ్ళు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారో … ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్ని కోట్లు నీళ్ళలా ఖర్చుచేస్తారో అన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా, దుబాయ్ షేక్ లకి మన భారతీయ సినీ హీరోయిన్స్ అంటే ఎక్కడలేని మోజు అని గతంలో కొన్ని ఉదాహరణలు చూశాం.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్స్ ని, దుబాయ్ షేక్ లు వారి పార్టీల కోసం భారీ ఆఫర్స్ ని ఆఫర్ చేస్తుంటారు. గతంలో ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్, కత్రినాకైఫ్ లాంటి వాళ్లు కూడ దుబాయ్ కంట్రిలోని, అక్కడి ఫంక్షన్స్ లో చిందులేసిన వాళ్ళే. ఆ విధంగా వారు చిందేసినందుకు భారీ అమౌంట్ ని తీసుకుంటారు.
అయితే ఇండియన్ హీరోయిన్స్ కి వస్తున్న దుబాయ్ పార్టీ ఆఫర్స్ ఒక్కోసారి చాలా హాట్ కూడ ఉంటాయి. దీపీకా పదుకొనెని పొట్టి పొట్టి డ్రస్సులతో డాన్స్ చేస్తూ అలరిస్తే దాదాపు రెండు కోట్ల రూపాయలను ఇస్తామని ఆ మధ్య ఆఫర్ చేసారు. అయితే అందుకు దీపికా పదుకొనె నో అని చెప్పింది. అలాగే కత్రినాకైఫ్ ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మూడు హాట్ పాటలకు చిందులేస్తే దాదాపు అయిదు కోట్ల రూపాయలు ఇస్తామని దుబాయ్ ని పిలుపు వస్తే, ఆ ఆఫర్ న సైతం కత్రినా కైఫ్ తిరస్కరించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సౌత్ బ్యూటీ ఇలియానకి దుబాయ్ నుండి ఓ పార్టిలో డ్యాన్స్ చేయాలని ఆఫర్ వచ్చింది. అందుకు ఇలియాన సైతం ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా బిటౌన్ నుండి అందిన సమాచారం.
తాజాగా ఇలియాన బిటౌన్ లో స్పెషల్ ప్రాజెక్ట్స్ ని కైవసం చేసుకుంటుంది. అలాగే తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్ కోసం దుబాయ్ వెళ్ళనుంది. అందులోని భాగంగానే ఇలియాన తన డ్యాన్స్ ని, దుబాయ్ షేక్ ల ముందు చూపించబోతుంది. అందుకు ఇలియాన తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు కోటిన్నర రూపాయలు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఇలియాని బంపర్ ఆఫర్ దొరికిందని అంటున్నారు.
The post దుబాయ్ షేక్ ముందు “షేక్” చేయనున్న భామ appeared first on MaaStars.
No comments:
Post a Comment